బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పరామర్శ
వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి 1 క్వింటా బియ్యం అందచేత
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ స్టేషన్ కు చెందిన సామల వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 1 క్వింటా బియ్యాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వీరభద్రం తమ్ముడు సూరయ్య,వీరభద్రం భార్య ఉపేంద్ర, కుమార్తెలు జమున,ఉమా,కళ్యాణి, మమత,సమత లను పరామర్శించి,ఓదార్చి వారికి మా నుండి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి ఎవరి ఇంటిలోనైనా సరే విషాదం నెలకొన్న,అట్టి విషయాన్ని తనకు తెలిపిన వెంటనే స్పందించి తను అందజేస్తున్న సహాయ సహకారాలు మృతుల కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పలువురు గ్రామస్తులు చెప్పుకొచ్చారు..
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు సామల నరసయ్య, మాజీ వార్డు సభ్యురాలు వనపర్తి లలిత, రాజా నాయక్, వెంకటమ్మ, సౌజన్య,సంగీత, సదానందం,మదన్,ధనమ్మ, ప్రవీణ్,మహేష్,మల్లేష్, పుష్ప,ప్రతిభ,నితిన్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.