పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు
మాజీ మండల్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్
శాయంపేట నేటి ధాత్రి :
శాయంపేట మండలంలోని కాట్రాపల్లి, ప్రగతి సింగారం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి గత వర్షకాలంలో కురిసిన వర్షాలకు సుమారు 500 మీటర్లకు పైగా బిటి రోడ్డు పైనుండి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల రోడ్డు అద్వాన పరిస్థితిలో చేరిందని మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే గౌస్ తెలిపారు . 9 నెలలు గడిచిన కాని అప్పటినుండి ఇప్పటివరకు నెలలు గడుస్తున్నా కానీ అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే కానీ ఈ రోడ్డును పట్టించుకునే నాధుడే కరువయ్యాడని కాట్రపల్లి, నూర్జహాన్ పల్లి , గొల్లపల్లి ,రాజుపల్లి, సాధనపల్లి, మల్లంపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ద్విచక్ర వాహనాల పైన ప్రయాణించడం వల్ల కత్తి మీద సాముగా మారింది గతవారంలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు పదుల సంఖ్యలో కాట్రపల్లి గ్రామానికి చెందిన సుదగాని బిక్షపతి తీవ్రంగా గాయపడ్డారు అయినప్పటికీ ఆర్అండ్ బి శాఖ అధికారులు పట్టించు కోవడం లేదు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్.గౌస్ స్థానిక ప్రజలు కోరుతున్నారు.