ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోతుందా!
మంజూరు చేసి రెండు సంవత్సరాలు,మొదలుకాని నిర్మాణ పనులు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో మెరుగైన పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. చాలా కాలం నుండి గ్రామపం చాయతీ కార్యాలయం కొత్తగా నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు గ్రామ పంచాయతీ నిధులు మంజూ రు చేసిన నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. భవన నిర్మాణ పనులను చేపట్టడా నికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే ఉన్నట్లు తయారైంది ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తెలిసిన కాంట్రాక్టర్లతో పనులు చేయి ద్దామన్న బిల్లులు సమయానికి వస్తాయని నమ్మకం లేకపోవ డంతో ఎవరు ముందుకు రావడం లేదు దీంతో శాయం పేట గ్రామపంచాయతీ నూతన భవనం కలగానే మిగిలి పోతుందా!