ఎన్నికలను మరిచిన ప్రభుత్వాలు
ఉమ్మడి జిల్లాలోని మాజీ లతో నడుపుతున్న సంఘాలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల మండలంలో గల చేనేత సొసైటీకి ప్రత్యేక అధికారి ఉండాలి కానీ సహకార సంఘానికి అధికారి లేడు. ఇక్కడ మాజీలే పరిపాలిస్తూ సంఘాన్ని అభివృద్ధి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత కార్మికులు ఇప్పటికైనా ప్రభుత్వంచేత స్థానిక ఎన్నికలు నిర్వహించి పద్మశాలి కులవృత్తిని పదిమందికి ఉపాధి కల్పించి చేనేత సొసైటీ అభివృద్ధి జరగాలి. తెలంగాణ రాక ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాయంపేట చేనేత సహకార సంఘం ఉత్తమ అవార్డు తీసుకుంది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలు వేరైనా చేనేత సొసైటీ ఎక్కడ చూసినా అభివృద్ధి క్షీణించింది.ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత సహకారానికి చేయూతను ఇచ్చి చేనేత కుటుంబాలను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు
చేనేత కార్మికులకు జీతాలు రాక దిక్కుతోచని స్థితిలో ఉండి నానా అవస్థలు పడుతూ కాలo గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేతకుటుంబాలకు ఆసరాగా ఉండాలి.ఈ కార్యక్రమంలోసంఘనాయకులు, కార్మికులు పాల్గొన్నారు.