సెల్యూట్ టూ ట్రాఫిక్ పోలీస్
వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ఔదార్యం
వరంగల్ తూర్పు, నేటిధాత్రి.
వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగర ప్రజలకు, ప్రయాణికులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించే గ్రీన్ మ్యాట్ షెల్టర్ లు ఏర్పాటు చేశారు. పోచంమైదాన్ బస్ షెల్టర్ కు తాత్కాలిక ఉపశమనం కల్పించిన ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు. పోచంమైదాన్ లో బస్ షెల్టర్ పై కప్పు లేక గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇదే విషయంలో ఎన్ని సార్లు వార్తలు రాసిన పట్టించుకొని రాజకీయ నాయకులు. మహిళా ప్రయాణికులు పోచంమైదాన్ బస్ సెంటర్లో నిలబడే అవకాశం కల్పించిన వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కు సెల్యూట్ అంటున్న నగర ప్రజలు.

ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు, బస్టాండ్ల వద్ద నిలబడి ఉన్నప్పుడు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.