ఇండియన్ ఆర్మీకి సెల్యూట్… ఫహల్గాం ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైనస్పందనకు శ్రీకారం చుట్టింది
ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్
దేశ సత్తా చాటిన సైనిక దళాలకు, పీఎం మోడీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల జిల్లావ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బిజెపి శ్రేణుల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )
ఈరోజు సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద
పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని , పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై” ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి , దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టా కాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.. ఇట్టి కార్యక్రమంలో ఆడెపు రవీందర్ రాంప్రసాద్ భాస్కర్ ప్రతాప్ నరేష్ శ్రీహరి రాజు నరసయ్య శ్రీనివాస్ చందు పరమాత్మ శేఖర్ వైశాలి మాధవి శిరీష ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.