పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు మట్టి అమ్మకం 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన
 ధర్మసమాజ్ పార్టీ నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు మట్టిని కాంట్రాక్టర్ లోతుగా తీసి అమ్ముకుంటున్నాడని ధర్మ సమాజ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం రోడ్డు పనులు డబుల్ బెట్ రూలను పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి గత ప్రభుత్వం షేర్ వాల్ టెక్నాలజీ తో ఇళ్లను నిర్మించడం జరిగిందని, ఆ ఇండ్లు లబ్ధిదారులకు పంచకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబించడం ద్వారా నిరుపయోగంగా మారాయని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు పంచకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని, ప్రభుత్వాన్ని దుయ్య బట్టారు. అదేవిధంగా పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డును మరమ్మత్తు ,కొత్త రోడ్డు నిర్మాణం పేరుతో ఎత్తుగా ఉన్న రోడ్డును 5మీటర్ల లోతుతో రోడ్డు తవ్వడం జరిగిందని . ఇప్పుడున్న ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో  ఎత్తున్న రోడ్డును ఎక్కువ లోతుతో మట్టిని తీయడం ద్వారా చుట్టుప్రక్కల ఇల్లు కట్టుకున్న కుటుంబాలు, ప్రస్తుత డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు వరద ముంపుకు గురై అవకాశాలు ఉన్నాయని వారన్నారు. మరోపక్క పాత ఎమ్మార్వో ఆఫీస్ అనుకొని గోదాం నిర్మాణం చేయడం ద్వారా నిత్యం ఎక్కువ లోడు ట్రాన్స్పోర్ట్ తో వెళుతున్న లారీల వల్ల రోడ్డు గుంతల మయంగా మారిందని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు రోడ్డు నిర్మాణ విషయంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి, జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్, మండల కన్వీనర్ కుర్రిస్వామినాథన్, మండల నాయకులు ఇంజపెల్లి విక్రమ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *