– కాళ్లు చేతులు గుంజులు… వివిధ గ్రామాల ప్రజల ఆరోపణలు….
– మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు…
కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-
కొల్చారం మండలం వ్యాప్తంగా పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. కల్తీ కళ్ళను అరికట్టి ఎక్సైజ్ అధికారులు నామమాత్రంగా కళ్ళు శాంపిల్ సేకరించడం
తదనంతరం చర్యలు చేపట్టకపోవడం? అదేవిధంగా ఇంత జరుగుతున్న కల్తీకల్లును హరి కట్టకపోవడం సందేహం ప్రజల్లో కలుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతున్న ధరలు తక్కువ ధరకు మత్తు, గంజాయి, క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థం కలుపుతున్నారని సందేహం లేకపోలేదు, తక్కువ ధరకు కళ్ళు దొరుకుతుందని మందుబాబులు ప్రభుత్వ వైన్స్ దుకాణాలకు బదులు, కళ్ళు దుకాణాలను ఎంచుకుంటున్నారు. కుత్రిమ కల్తీకల్లు ద్వారా అనారోగ్యంతో పాటు వ్యాస నరుపలుగా, బానిసత్వానికి లోనే, సైకో లు గా మారుతున్న యువత, ప్రకృతి ప్రసాదించే ఈత లేదా తాటికల్లు బదులు, కల్తీ బాబులు వ్యాపారంగా మార్చుకున్నారు. మత్తుకు బానిస అయిన వారిని అదుపు చేసుకొని వ్యాపారాన్ని బహిరంగ విచ్చలవిడిగా కళ్ళు సీసాలలో కల్తీకల్లు అమ్ముకుంటూ ప్రజలకు హాని చేసే ప్లాస్టిక్ కవర్ల తో విచ్చలవిడిగా కళ్ళు ప్యాకెట్లో అమ్ముతున్నారు. ఇప్పటికైనా కల్తీ కల్లును అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారుల పై ఉందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎంతవరకు కల్తీ కల్లును హరి కడతారో వేచి చూడాలి మరి.