జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాలి

వనపర్తి నేటిధాత్రి :జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకుండా
అధికారులు కాంట్రాక్టర్ వేధిస్తున్న న్నారని ఏఐసీ టి యూ సి అఖిల పక్ష ఐక్యవేదిక కార్మికుల కు మద్దతు ఇచ్చి ధర్నా చేశారు కాంట్రాక్టర్ మరియు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న బాధ్యులను శిక్షించాలని ఎ.ఐ.టి.యు. అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్.చేశారు
వనపర్తి జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్స్ కార్మకులకు జీతాలుఇవ్వలేదు అని వారు ఆవేదన వ్యక్తంచేశారు
ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ
జిల్లా ఆస్పత్రిలో రెండు సంవత్సరాలుగా కార్మికుల పేరిట జీతాలు మాయం కావడం జరుగుతుందని దానిపై విచారణ చేయాలని పలుమార్లు ఐక్యవేదిక కోరిందని, విచారణ పేరుతో కార్మికుల వేతనాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. 148 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా చూయిస్తూ వారి జీతాలు మాయం చేయడం జరిగిందని, కొందరు వారిని నియమిస్తూ వారి జీవితాలు తీసుకున్నట్లుగా తెలిసిందని, వారి అకౌంట్లో డబ్బులను పరిశీలిస్తే తెలుస్తుందని తెలుపుతూ, విచారణ పేరుతో డబ్బులు లేక అల్లాడుతున్న కార్మికులు ధర్నా చేయడం జరిగింది వారికి మద్దతుగా ఏ.ఐ.సీ.యూ.సీ రాష్ట్ర నాయకులు సురేష్ జిల్లా నాయకులు, గోపాలకృష్ణ, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, ఎస్సీ, ఎస్టి మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు మద్దతుతెలిపారు
మాతా శిశు సంరక్షణ అంబులెన్స్ ను మరియు ఆస్పత్రిలోని పాత మరియు కొత్త ఇనుప మంచాలు, తదితరు సామాన్లు టెండర్ లేకుండా అమ్ముకున్నారని వాటిపై విచారణ చేసి దోషులను శిక్షించాలని, ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చర్యలు తీసుకోవాలని బాధ్యులను శిక్షించాలని లేనియెడల ఆందోళన చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!