జమ్మికుంట: నేటి ధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమ్మికుంటకు చెందిన సజ్జద్ అలీని నియమిస్తూ శనివారం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బి వి శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సజ్జద్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా పనిచేస్తున్నానని నా పనిని గుర్తించి నాకు హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషకరమనితెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు అందుతాయని, అధిష్టానం గుర్తిస్తుందని తెలిపారు. తన నియామకానికి కృషిచేసిన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్అధ్యక్షులు బి వి శ్రీనివాస్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి గారికి, మజీద్ ఖాన్ గారికి,ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు గారికి, హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడితల ప్రణవ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.