
Duggondi Ex-MPTC Saikumar Passes Away, Youth Pay Tribute
సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు
దశదినకర్మ సందర్భంగా రక్తదాన శిబిరం
మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా
కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్,
బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.