రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించి అభినందించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించడం హర్షనీయమని, సాయికిరణ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని సాయికిరణ్ నిరూపించాడన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపీపీ జవ్వాజి హరీష్, నాయకులు వీర్ల నర్సింగరావు, కోల రమేష్, బండపల్లి యాదగిరి, కాడే శంకర్, సుదీర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, మారుతి, తదితరులు పాల్గొన్నారు.