సాయి పల్లవి ఫోన్ నంబర్ కాంట్రవర్సీ

సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ఫోన్ నంబర్లు వాడుతుంటారు. ఆ ఫోన్ నంబర్లు నిజంగా వారివి కాదన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ కొంత మంది పిచ్చి ఫ్యాన్స్, అమాయకపు అభిమానులు ఆ నంబర్లు సదరు హీరో, హీరోయిన్‌లవే అనుకుంటారు. ఇక పదే పదే ఆ నంబర్లకు ఫోన్ చేస్తుంటారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రీసెంట్‌గా అమరన్ చిత్రానికి సంబంధించిన ఓ సీన్‌లో హీరోయిన్ పాత్ర తన ఫోన్ నంబర్‌ను హీరోకి కాగితం మీద రాసి విసురుతుంది. అందులో ఫోన్ నంబర్ క్లియర్‌గా కనిపిస్తుంది.

చాలా వరకు ఇలాంటి నంబర్లను చూపించే టైంలో బ్లర్ చేసి చూపిస్తుంటారు. అలా బ్లర్ చేస్తే ఏ గొడవ ఉండదు. కొన్ని సార్లు మేకర్లు ఆ నంబర్లను చెక్ చేసుకుని సినిమాల్లో పెడుతుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఫోన్ నంబర్ పెడుతుంటారు. అది ఇంకెవరిదో అయి ఉంటుంది. సినిమా ప్రభావం వల్ల ఆ ఫోన్ నంబర్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోన్ నంబర్ ఉన్న వ్యక్తికి ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తుంటారు.

అలా ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ అంతా కూడా అమరన్ మూవీలో చూపించిన ఫోన్ నంబర్ మీద పడ్డారు. సాయి పల్లవి నంబర్ అనుకుని కొంత మంది పదే పదే ఫోన్లు చేస్తున్నారట. దాని వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగు వేల కాల్స్‌ తనకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూ.1.1 కోటి పరిహారం కోరుతూ మూవీ టీమ్‌కు లీగల్‌ నోటీసులను సైతం పంపించాడు. అయినప్పటికీ టీమ్‌ నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇటీవల అతడు మద్రాస్‌ హైకోర్టులో ఈ విషయంపై దావా వేశాడు. దీంతో ఈ వివాదంపై మేకర్స్​ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ వివాదానికి కారణమైన నంబర్‌ను ఓటీటీ వెర్షన్​లో బ్లర్‌ చేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లోనూ ఈ పాటకు సంబంధించిన వీడియోలోనూ నంబర్‌ను పూర్తిగా బ్లర్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!