యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి
చౌటుప్పల్: మున్సిపాలిటీలో హ్యాండ్లూమ్ మార్కెట్ చౌటుప్పల షాపింగ్ కాంప్లెక్స్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చౌటుప్పల మాజీ ఎంపీటీసీ గోశిక సుమతి కరుణాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాంప్లెక్స్ మహిళా భక్తుల చేత సహస్ర దీపారాధన పలు రకాల పూలతోటి అందంగా అలంకరించి 1008 దీపాలతో గణనాథుడికి పూజలు చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది అని అన్నారు ప్రతి కుటుంబంలో నవరాత్రులు గణనాథుడికి పూజలు చేయడం వల్ల ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లోపట మానసిక ధైర్యాన్ని ఆరోగ్యాన్ని అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ సభ్యులు గోశిక కరుణాకర్, బద్దం లింగారెడ్డి ,మసరం యాదగిరి, గోలి యాదగిరి, మల్లేశం ,ములుగు లక్ష్మయ్య ,విష్ణు మహేందర్, సత్యనారాయణ, గోశిక పాండు, కోడి వనిత, వసంత, మమత ,శారద లావణ్య ,సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.