నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఎస్సైస్వాతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.చండూరు మండల పరిధిలోనిబంగారిగడ్డ గ్రామంలోసేఫ్టీ మోకులపైగీత కార్మికులకుశిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్టీ మోకులు వినియోగించడం వలన ప్రతి గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి రక్షణ పొందవచ్చనివారు తెలిపారు.గీత కార్మిక వృత్తిచాలా ప్రమాదకరమైనది. గీత కార్మికుడికి కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు సైదులు, శ్రీను కుమార్, నల్లగొండ టీం ట్రైనర్స్ కాసాని సత్తయ్య,సైదులు, శంకరయ్య,గీత పని వారలసంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శంకరయ్య, ఎక్సైజ్ అధికారి ప్రభాకర్ గీత కార్మికులుతదితరులు పాల్గొన్నారు.
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి : చండూరు ఎక్సైజ్ ఎస్ఐ స్వాతి
