Europe urges India ahead of Putin visit
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
భారత్, రష్యాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి పాతికేళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక 2010లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా గుర్తించడంతో దౌత్య బంధం మరింత బలోపేతమైంది.
