Russell Retires from IPL Before 2026 Season
ఐపీఎల్‌కు రస్సెల్ రిటైర్మెంట్
ఐపీఎల్ 2026కి ముందు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఎన్నో ఏళ్లుగా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్‌ను.. ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు.
ఐపీఎల్ 2026కి ముందు మరో ఊహించని పరిణామం ఎదురైంది. కేకేఆర్ డేంజరెస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వేలానికి ముందు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రస్సెల్‌ను కేకేఆర్ వదిలేసింది. ఈ క్రమంలో అతడి ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది. కాగా వచ్చే సీజన్ నుంచి రస్సెల్ కేకేఆర్(KKR) పవర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
