నిత్యం ప్రమాదాలు… చోద్యం చూస్తున్న అధికారులు
ప్రాణ నష్టం జరుగుతున్న..ప్రజా సమస్యలు పట్టించుకునే నాథులే లేరా
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని గ్రామాలలో రహదారులు పశువులకు అడ్డాగా, దొడ్డిగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే వారే కరువైపోయారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా పెడచెవిన పెట్టారు. ఎన్నో కుటుంబాలు ప్రమాదాలతో రోడ్డున పడుతున్న సంఘటనలు రోజు వినిపిస్తూనే ఉన్నాయి,కనిపిస్తూనే ఉన్నాయి. రాత్రి సమయంలో పశువులు రోడ్లపై ఉండడంతో అత్యవసరమైన ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతూ అలాగే వాహనదారులకు రాత్రి వేళలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అసలే వర్షాకాలం చిమ్మ చీకటిలో రహదారి కూడా సరిగా కనిపించనీ పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణంలో వాహనదారులు పశువుల వల్ల ప్రాణాలు కోల్పోయి అశువులుబాసిన మరణ వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటున్నాయి. రోడ్డు పైన పడ్డ కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు పశువులు రోడ్ల పైన ఉండకుండా,సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుచున్నారు.