ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం…
నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో నూతన సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు, అదేవిధంగా గ్రామపంచాయతీలో ప్రజల సమస్యలపై సమీక్ష సమావేశానికి విచ్చేసి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటిపై అధికారులతో చర్చిస్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామాలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేశారు. అలాగే పంచాయతీలలో నిటి సరఫరా గురించి, కరెంటు సమస్యల గురించి, ఇరిగేషన్, విద్య వైద్యం అన్ని సమస్యలను అధికారుల దృష్టిలోకి తెచ్చి వారంలోగా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ నెల ఆఖరి లోగా ఇందిరమ్మ ఇండ్ల పథకం మరియు కొత్త ఫ్యామిలీ కార్డు సర్వే జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తానై చూసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు . ఈ యొక్క కార్యక్రమానికి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యిద్ ఇక్బాల్ హుస్సేన్, సమత్ బట్టుపల్లి మాజీ సర్పంచులు పోలేబోయిన తిరుపతయ్య, శ్రీవాణి, బట్టుపల్లి మాజీ సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, గోగ్గలి రవి, జలగం కృష్ణ, వట్టం చుక్కయ్య, బుడుగుల మధు, తదితరులు పాల్గొన్నారు