
Rural BT Roads in Dire Condition, Urgent Repairs Needed
మరమ్మతులకు నోచుకోని…గ్రామీణ బీటీ రోడ్లు..
గతంలో మారుమూల గ్రామాలకు వేసిన బీటీ రోడ్లు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. పాదైన ఈ రోడ్లకు మరమ్మతులైన చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఆ రోడ్లు ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. అయితే ప్రభుత్వం కొద్ది రోడ్లకు గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నది. ఝరాసంగం మండలంలోని ఝరాసంగం నుంచి సిద్ధాపూర్ నరంపల్లి గ్రామాల మీరు గా న్యాబ్ మండలంలోని మిర్నపూర్ గ్రామం వరకు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుకు న్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై సిమెంట్ పోయి కంకర రోడ్డుగా మారింది. రోడ్డుపై గుంతలు పడడంతో చిన్నపాటి వర్షానికి అవి నిండి ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగిన సంఘట నలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడం లేదు. మరోవైపు సిద్దాపూర్ నుంచి దుర్మాపూర్ వైపు ఉన్న బీటీ రోడ్డుపై గుంతలు పడడంతో ప్రమాదంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్రా లకు చెందిన భక్తులు నిత్యం ఈ రోడ్డు కుండానే ఝరాసంగంలోని కేతకి సంగ మేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిపోతుం టారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు కూడా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. అయినా మర మ్మతులు చేపట్ట కోవడం పట్ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు.
బర్దీపూర్ నుండి చిలే పల్లి, చిలేపల్లి తండా వైపు ఉన్న బీటీ రోడ్డు దారుణంగా తయారైంది.ఝరాసంగం నుండి బొపాన్ పల్లి,జీర్లపల్లి మీదుగా ముని పల్లి మండలంలోని పెద్ద చెల్మెడ గ్రామం వైపు ఉన్న బీటీ రోడ్డు కూడా గుంతలు పడి గుం తలమయంగా మారింది. బొపాన్ పల్లి నుండి ప్యాలవరం, దేవరంపల్లి వైపుగల బీటి రోడ్డు కూడా ధ్వంసమైంది. ఝరాసంగం నుండి మేదపల్లి, ఈదులపల్లి మీదుగా కోహీర్ మండ లంలోని దిగ్వాల్ వైపు గల బీటీ రోడ్డు అడుగ డుగున గుంతలు పడి ప్రమాదంగా నూరింది. బిడకన్నె నుంచి రాయిపల్లి మధ్య, జాతీయ రహదారి వరకున్న బీటీపై రోడ్డుపై గుంతలు ” పడడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజ లు ఇక్కట్లు పడుతున్నారు. బిడకన్నె నుంచి ” కుప్పానగర్ గ్రామం వైపు ఉన్న మెటల్ – రోడ్డుపై కంకర తేలి గుంతలు పడ్డాయి. ఇక్క ది వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కోహీర్ మందలంలోని కవేలి చౌరస్తా నుండి చిలేమామిడి జీర్ణపల్లి, ఏడాకు లపల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్లు ఛిద్రమై 1 ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతు న్నారు. జాతీయ రహదారి నుంచి ంచి కోహీర్ మండలంలోని దిగ్వాల్,రాజనెల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమై అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.ఈ రోడ్డుపై వాహనాల మాట అటు ఉంచితే కనీసం నడిచి వెళ్లాలన్నా అనువుగా లేదనిఇ ఆయా గ్రామా ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాడైన రోడ్లలకు వెంటనే మర మృతుల పనులు చేపట్టాలని జహీరాబాద్ – నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.