– క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తా..
-నృత్య ప్రదర్శన చేసిన చిన్నారిని అభినందించిన పల్లా
-ముగిసిన అండర్ -14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ :
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు రాణించేలా ప్రోత్సహించా లని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని 13వార్డ్ ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అండర్-14 బాలుర బాలికల విభాగంలో జరిగిన కబడ్డీ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో ముఖ్య అతిధిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైయ్యారు..ముందుగా విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు..క్రీడాకారులను కలిసి అభినందనలు తెలిపి విద్యార్థులతో కబడ్డీ ఆడారు..అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు..క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి..అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. జిల్లా నుంచి పోయే విద్యార్థులకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. స్కూల్ కి సంబందించిన ఏ సమస్య ఉన్నా తెలియ చేయండి..స్కూల్ కి పెన్సింగ్ నిర్మాణం కోసం స్థానిక ప్రజా ప్రతినిధిలతో కలిసి పరిశీలించి త్వరితగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు..ఎలాంటి సమస్యలు ఉన్నా తన సేవలను సద్వినియోగం చేసు కోవా లన్నారు..అనంతరం అధికారులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే పల్లా కి మెమోంటో అందజేసీ సన్మానం చేశారు. సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసిన చిన్నారితో పాటు విద్యార్థి నులను ఎమ్మెల్యే పల్లా అభినందించారు..అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు..