
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆర్టికల్ – 275(I) నిధులు రూ.14 లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బర్త్ వెయిటింగ్ గదిని కూడా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత మునుపెన్నడూ లేనివిధంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా, ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు, నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని వివరాలను సక్రమంగా రికార్డులో రోజు వారిగా నమోదు చేయాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు.పంబాపూర్ భీమ్ ఘనపూర్ చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే. జి ఎస్ ఆర్
భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనపూర్ చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్ ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై విడుదల చేశారు. ముందుగా అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కొత్తూరి ప్రవీణ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన ఎమ్మెల్యే.ఆజంనగర్ గ్రామ యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కొత్తూరి ప్రవీణ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ప్రవీణ్ ఇంటి వద్ద ఎమ్మెల్యే శాలువా కప్పి, కేకు కోసి విషెస్ తెలిపారు. ప్రవీణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుంకర రామచంద్రయ్య చల్లూరు మధు బుర్ర కొమురయ్య తాటి వెంకన్న అంబాల శీను తోట రంజిత్ దుర్గం అశోక్ తదితరులు పాల్గొన్నారు