రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిన్న వెలువడిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నలుగు యువకులు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన యువకులలో తోకల శేశిధర్ ( ఫైర్ కానిస్టేబుల్ ),ఏఆర్ కానిస్టేబుల్ గా ఆకుల నవీన్, బాసాని సూర్య ప్రకాశ్, Tssp కానిస్టేబుల్ గా ఎంపిక అయిన నేధూరి వినయ్ ఉన్నారు. త్వరలోనే వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. స్థానిక ఎంపీపీ గంగo స్వరూప రాణి ,జెడ్పిటిసి గట్ల మీనయ , సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మరియు ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు ,తదితరులు వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.