
Rudrabhishekam puja
అల్లీపూర్ లో రుద్రాభిషేకం….
రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:
మండలం అల్లీపూర్ గ్రామములో స్థానిక శ్రీరాజరాజేశ్వర దేవాలయం లో … మాస శివరాత్రి సందర్భముగా మహాన్యాస రుద్రాభిషేకం పూజా, భజన కార్యక్రమము నిర్వహించారు ఆషాడ మాసం … చివరి రోజున మాస శివరాత్రిని పురస్కరించుకొని…. రుద్రునికి అభిషేకం చేయడం వలన వర్షాలు సమృద్ధి కురిసి దేశం సుభిక్షముగా ఉండాలని ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి నెల మాస శివరాత్రి రోజున నిర్వహించుచున్న మహా రుద్రాభిషేకం కార్యక్రమము లో భాగంగా లోక కళ్యాణార్థం 5వ మాసం నెలవారి మహాన్యాస రుద్రాభిషేకం పూజా , భజన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించారని మరియ ఇట్టి కార్యక్రమము లో శ్రావణమాసం నిత్య భజన 30 రోజుల కార్యక్రమమునకు సంబంధించిన ప్లెక్సీ ని ఆవిష్కరించడం జరిగినది అని హనుమాన్ భజన మండలి అధ్యక్ష , కార్య దర్శి చిట్యాల భూమయ్య,నామని లక్ష్మీనర్సయ్య దేవాలయం అనువంశిక అధ్యక్షులు నామని శేఖర్ తెలిపారు…. ఇట్టి కార్యక్రమము లో ఆలయ అర్చకులు గురు లింగు మఠం వినయ్, విక్రమ్, హనుమాన్ భజనమండలి అధ్యక్షులు చిట్యాల భూమయ్య, ప్రధాన కార్యదర్శి నామని లక్ష్మీనర్సయ్య, దేవాలయ అధ్యక్షుడు లు నామని శేఖర్, భజన మండలి ఉపాధ్యక్షులు మిట్టపల్లి దామోదర్ , క్యాషియర్ అనుమల్ల మల్లేశం, ప్రచార కార్యదర్శి ఉరుమడ్ల వాసు, పొలాస ప్రభాకర్, ఎల్లేశ్వరం అశోక్, వేముల వెంకటయ్య, ఎంబారి మల్లేశం, ఎండపల్లి శేఖర్ , సాగి వినోద్ రావు, సాగి వేణురావు, కొప్పుల గంగారెడ్డి, నామని గణేష్, బొజ్జ శ్రీనివాసరావు, అనుమల్ల రాజేశం, నామని ప్రసాద్, అందుర్తి శ్రీనివాస్, సిద్ధుపూజారి, మఠముల లిక్కు, తదితరులు ఫాల్గొన్నారు ఇట్టి కార్యక్రమము దేవాలయ ప్రధాన పూజారి అంగడి మఠం భువనేశ్వర్ అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు