RTC Workers Protest
ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ చట్టాలను తీసుకువచ్చి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి ఉపసంహరించుకోవాలని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న బ్లాక్ డే గా పాటించి నల్ల బ్యాడ్జీలు ధరించాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపుకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ భూపాలపల్లి డిపోలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది
ఈ కార్యక్రమంలో
బండి శ్రీనివాస్,సంతోష్, రంజిత్,రమేష్,మోతిలాల్,కొలిపాక ప్రసాద్. డి రాజయ్య అశోక్.ఎమ్ఐ కుమార్. నాయక్ కోమల అనిత తదితరులు పాల్గొన్నారు
