
మంచిర్యాల నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి నిర్వహించబడుతున్న గిరిజన జాతర. ఈనెల 21 తారీకు నుండి 25 తారీకు వరకు మేడారం సమ్మక్క సారమ్మ జాతరలో కోటి మందికి పైగా భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారంతో తమ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడిపిస్తుంది. భక్తులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల కండక్టర్ల పాత్ర చాలా కీలకమైనది. అవిశ్రాంతంగా, చిత్తశుద్ధితో, విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు సిబ్బందికి గరిమిల్ల లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, క్లబ్ డైరెక్టర్ లయన్ గాజుల ముఖేష్ గౌడ్, ఆర్టీసీ ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ శ్రీ సాల్మన్ రాజ్, మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీ రవీంద్రనాథ్ గారలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బృహత్తరమైన విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు కండక్టర్లకు గరిమిళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్మిళ్ల లయన్స్ క్లబ్ సభ్యులు వంగల సంపత్ కుమార్, కొంకుముట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి రాఘవేంద్రరావు, అక్కల దేవి రాజమౌళి, వేముల ప్రవీణ్,పొనుగోటి శ్రీధర్ రావ్, ఆర్టీసీ మంచిర్యాల అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ శ్రీమతి దేవపాల,డిపో కంట్రోలర్ వెంకటేష్, సీనియర్ క్లర్క్ కట్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.