New Assistant Manager Joins Zaherabad RTC Depot
ఆర్టీసీ డిపోకు కొత్త అసిస్టెంట్ మేనేజర్, ఉద్యోగుల ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆర్టీసీ డిపోకు నూతన అసిస్టెంట్ మేనేజర్‌గా శ్వేత కల్వకుర్తి నుండి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులు సిద్దయ్య స్వామి, సుకీర్త, సీతిలి భాయి, మరియు కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులే సంస్థ ప్రగతికి మూలమని, అందరూ కలిసి సంస్థ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
