RTC Workers Join BC Bandh in Narsampet
కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు
బీసీ బంద్ లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నేపథ్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చక్రాలు కదల్లేదు. ఉద్యోగులు, కార్మికులతో బంద్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల నుండి ఆర్టీసీ కార్మికులు బంద్ లో పాల్గొని విజయవంతం క్టారు.
దీంతో ఆర్టీసీ బస్సుల చక్రాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.నర్సంపేట డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులందరు మద్దతిచ్చామన్నారు. జిల్ల వర్కింగ్ ప్రజిడేంట్ వేములు రవి ,నాయకులు బి. రమేష్ ఎన్.ప్రవీణ్, మాదవ్ రేడ్య, కిరణ్ కుమార్ గౌడ్ ,సాంబయ్య మహేందర్, యాదయ్య, అనిల్, రాజు,శ్రీను,రవి, బాస్కర్, కిషన్, గోవర్దన్, కె యస్ రావు, ప్రబాకర్, డిపి లీల, శ్రీలత, రమణ, సరిత, శ్రీలత తదితర కార్మికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
