ప్రమాదమని తెలిసి ఆర్టిసి బస్సు ఫుట్ బోర్డు ప్రయాణం

*స్కూల్ పిల్లల అవస్థలు

వెంకట్రావుపేట,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వెంకట్రావుపేట, బావుసాయిపేట, కొండాపూర్ నుండి మోడల్ స్కూల్ వెల్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకే ఒక్క బస్ వేములవాడ నుండి సుద్దాల, కనగర్తి మీదుగా వస్తూ ఆ ఊర్ల విద్యార్థులను తీసుకుని ఈ మూడు ఊళ్ళ వాల్లను తీసుకురావడానికి వస్తుంది. బస్ మొత్తం ఫుల్ అయి పది, పదకొండు సంవత్సరాల పిల్లలు ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ ప్రమాదపుటంచున వెలుతున్నారు. అనుకోని ప్రమాదం జరగకముందే ఈ సమస్యకి పరిష్కారం చూడాలని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!