Mata Shishu Center
మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం..
పెద్దపల్లి జిల్లా నేటి ధాత్రి:
https://youtu.be/xwCqMiHG2Rw?si=V8PChjGnTuKuW9qk
వరంగల్ జిల్లాలోని మామునూరు క్యాంప్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) గా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఈర్ల కృపావరం భార్య స్నిగ్ధ పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఆర్ ఎస్సై మాట్లాడుతూ తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఏరియాలోని బొంకూరి కాలనీకి చెందిన ఆర్ఎస్ఐ కృపావరం భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఆ జంట ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
