నువ్వు దొంగ… నువ్వే గజదొంగ!!
చిత్రపురి సొసైటీ సభ్యుల ఫైటింగ్!
నువ్వు 50 కోట్లు తిన్నావ్?
నువ్వేం తక్కువా 100 కోట్లు మింగావ్!
గల్లాలు పట్టుకొని కొట్టుకునుడొక్కటే తక్కువ!
మీటింగ్ అంతా బూతుల పంచాంగమే!
ఒకరి మీద మరొకరి వీరంగమే!
ఇప్పుడేం చేద్దామో! ఆలోచించండని కొందరు!
సరిదిద్దుకోలేనంత తప్పు చేశామని మరికొందరు.
లెక్కలేనంత మింగి ఇప్పుడు సవరించుకోలేమని ఇంకొందరు.
నీ కక్కుర్తి వల్లే రో హౌస్ లు అంటూ ఒకరు!
కార్మికులకు కాకుండా ఎన్నారైలకు అమ్మిందే నువ్వని మరొకరు!
అర్థరాత్రి దాకా చిత్రపురి సొసైటీలో ఒకరిపై ఒకరు చిందులు!
సిఎం. రేవంత్ రెడ్డి ఎవరినీ వదిలిపెట్టేలా లేడని చిత్రపురిలో మంతనాలు.
ఆది నుంచి అన్నీ తవ్వాలని చూస్తున్నాడు.
రో హౌస్ లే కాదు, అప్పార్టెంట్ల లెక్క కూడా తేలనుంది.
విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి అమ్ముకున్నారు.
అసలైన కార్మికులకు సొసైటీ పెద్దలు తీవ్ర అన్యాయం చేశారు.
దోచుకోవాల్సినంత దోచుకొని కొంతమంది పెద్దలు తప్పుకున్నారు.
తమకు సంబంధం లేదని చేతులు దులుపునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ సినీ కార్మికుల లెక్క తేల్చనున్నారు.
ఆంధ్ర సినిమా పెద్దల బాగోతం బైటకు తీయనున్నారు.
సినీ గద్దల బండారం మొత్తం బైట పెట్టనున్నారు.
చిత్రపురిలో మీడియా జర్నలిస్టులకు ఇండ్లు ఎలా వచ్చాయి!
1989 నుంచి ఇప్పటి వరకు జారీ అయిన జీవోలన్నీ పరిశీలనకు రానున్నాయి.
చిత్రపురి గద్దలుకు సినిమా చూపించడమే తరువాయి!
చిత్రపురిలో రభస…
ముఖ్యుల మధ్య గలాట…
మాటా, మాట పెరిగి పెద్ద రగడ.
లాక్కోలేక, పీక్కోలేక సంవాదాలతో తికమక.
తిన్నది ఎలా కక్కాలో అర్థం కాక…
త్వరలో మీ నేటిధాత్రిలో ఎక్స్ క్లూజివ్ స్టోరీ