Immediate Road Construction Demanded at Buchinelli Industrial Area
బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లను తక్షణమే వేయాలి.
◆:- గుంతల మయంగా మారిన రోడ్లతో ప్రమాదాలకు గురవుతున్న కార్మికులు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలోని బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతం మహీంద్రా వెండర్ పార్కులో పూర్తిస్థాయిలో రోడ్లు గుంతల మయంగా మారడంతో కార్మికులు డ్యూటీకి వెళ్లేందుకు వచ్చి వెళు తున్న కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికే కొంతమంది కార్మికులు ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలయ్యారని, ఈ విషయమై అనేకసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించకపోవడం సరైన పద్ధతి కాదని తక్షణమే కొత్త రోడ్లు వేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ మహిపాల్ డిమాండ్ చేశారు. ఈరోజు ఈ సమస్యపై బుచినెల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సిఐటియు ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జహిరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ మహిపాల్ మాట్లాడుకు టీజీఐఐసీ పరిధిలోకి వచ్చే ఈ మహీంద్రా వెండర్ పార్కులో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయని వేల మంది కార్మికులు రోజువారిగా డ్యూటీలకు వస్తూ వెళ్తూ ఉంటారని ఫస్ట్ షిఫ్టు వచ్చే కార్మికులు సెకండ్ షిఫ్ట్ అయ్యి వెళ్లే కార్మికులు నైట్ షిఫ్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారడంతో కింద పడి కార్మికులు ప్రమాదాలకు గురై హాస్పిటల్ లో పాలవుతున్నారని అయినా టీజీఐఐసి అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం సరైనది కాదని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కొన్ని వేల మందిదీ అయినా కూడా పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల %జ×ుఖ% నాయకులు సందీప్ రెడ్డి నరేష్ నారాయణ కిరణ్ బాల్రాజ్ మహా లింగ శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.
