Poor Roads Inside MGM Hospital
“ఎంజీఎం” ఆసుపత్రి ఆవరణలో అధ్వాన్నంగా “రోడ్లు”.
ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇలాంటి రోడ్డు పరిస్థితులు ఉండటం “సిగ్గుచేటు”.
పట్టింపులేని నాయకులు, మొద్దు నిద్రలో అధికారులు
నేటిధాత్రి, వరంగల్.
ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో రోడ్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వాన్నంగా మారుతోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ గేటు వద్ద నుండి లోపలికి వెళ్ళే మార్గం గుంతలతో నిండిపోయి రోగులు, సిబ్బంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

పడుతున్నారు. ఆసుపత్రి ప్రధాన గేటు ద్వారా నిరంతరం అంబులెన్సులు, వైద్య సిబ్బంది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రోడ్డు మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు మధ్యలో పడి ఉన్న గుంతల కారణంగా ఇనుప సలాకులు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారినట్లు ఆసుపత్రికి వచ్చే వారు చెబుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా నీరు చేరి గుంతలు నిండిపోవడంతో నడవడానికి కూడా కష్టంగా ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. “

ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇలాంటి రోడ్డు పరిస్థితులు ఉండటం సిగ్గు చేటుగా ఉంది” అని రోగులు, బంధువులు అభిప్రాయపడ్డారు. తక్షణమే స్పందించి రోడ్లను మళ్లీ వేయాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

