రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో, మండల కేంద్రంలో ప్రధాన రహదారిపైనే వైన్ షాపులు వెలవడంతో అటుగా ప్రయాణం చేసే ప్రయాణికులకు, బాటసారులకు, మహిళలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే రామడుగు ఎక్స్ రోడ్డు వద్ద వెదిర గ్రామంలో ఏర్పాటుచేసిన వైన్ షాపు ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో మద్యం కొనుగోలు నిమిత్తం, మద్యం సేవించడంకై విచ్చేసినటువంటి మద్యం ప్రియుల వాహనాలను ప్రధాన రోడ్ల పక్కనే పార్కింగ్ చేయడం అటువైపుగా వెళుతున్నటువంటి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. అలాగే రామడుగు మండల కేంద్రంలోని వైన్ షాప్ ఊరికి దగ్గరలో ఉండడం ప్రతి మంగళవారం వారసంత నిర్వహించడం అటువైపుగా వస్తున్నటువంటి ప్రయాణికులకు, మహిళలకు మద్యం ప్రియులు బహిరంగ మూత్ర విసర్జనలు చేస్తూ కనబడడం చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై సంబంధిత అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపడితే బావుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.