రోడ్డు భద్రత ప్రమాణాలు ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు

 

# రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కీలక చర్యలు

# ప్రజల భద్రతనే ద్యేయం జిల్లా ఎస్పి గౌష్ ఆలం ఐపిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్.హెచ్ 163 గౌస్ పల్లి నుండి పేరూరు వరకు 127 కి.మీ ఎన్ హెచ్ 365 05 కి.మీ రాష్ట్ర రహదారి ఎస్ హెచ్ 12 వెంకటా పురం నుండి వాజీడు వరకు 48 కి.మీ ఇతర రోడ్స్ 242.7 కి.మీ మేర విస్తరించి అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాలతో సరిహద్దు కలిగి, అనేక పునరుత్పాదక వనరులు, పురాతనమైన దేవాలయాలు ఆసియ ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర తో పాటు అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నందున వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున నిరంతరం రాకపోకలు జరుగుతాయి ఈ క్రమంలో సరైన రోడ్డు భద్రత నియమాలు పాటించక పోవడం రోడ్డు యొక్క స్థితిగతులు పై అవగాహన లేకపోవడం వల్ల రహదారులు రక్తసిక్తం అవుతున్నవని గ్రహించిన జిల్లా ఎస్ పి గారు రోడ్డు ప్రమాదాలను ఎట్టి పరిస్థితిలో తగ్గించే దిశగా నిర్ణయం తీసుకొని అనేకసార్లు రహదారుల వెంబడి ప్రయాణించి రోడ్డు వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రణాళికను రచించారు. అందులో భాగంగా 1 జిల్లా రహదారి భద్రత కమిటీ రోడ్డు ప్రమాదల తీరు, తీసుకోవాల్సిన జాగ్రతలు,డేటా కలెక్షన్, నూతన సంస్కరణలు ప్రతి పాదన.ఇందులో సి ఐ సి సి ఎస్ గారు ఇంచార్జి గా ఉండగా 1 ఎస్ ఐ, 2 ఏ ఎస్ ఐ/ హెడ్ కానిస్టేబుల్స్ 4 కానిస్టేబుల్స్ మొత్తంగా 8 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు ప్రస్తుత తడ్వాయి ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఓంకార్ ఎస్ఐ గారికి ట్రాఫిక్ విధానాలపై శిక్షణ కూడా ఎస్పి ఇప్పించడం జరిగింది 2. గ్రామ/ పోలీస్ స్టేషన్ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు ఇందులో సభ్యులుగా పదవి విరమణ పొందిన టీచర్స్, మహిళా ప్రతినిధులు, గ్రామ యువత. పోలీస్ వారి ఆధ్వర్యంలో వీరు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కార్యక్రమాలు చేపడతారు 3 సోలార్ బ్లీంకర్స్ బర్రికాడ్స్ ఏర్పాటు రాత్రి సమయాలలో ప్రమాదాలు జరగ కుండా నూతన సోలార్ బ్లీంకర్స్ తో బర్రిక్యాడింగ్ ఏర్పాటు చేసారు 4.స్పీడ్ బ్రేకర్స్ రంబల్ స్ట్రిప్స్ రేడియం స్టికర్స్ వార్నింగ్ సైన్ బోర్డ్స్ గుర్తించి రద్దీ ప్రదేశాలలో మరియు మూలమలుపుల వద్ద ఏర్పాటు ఎస్పీ స్వయంగా డిఎస్పి సిఐ ఎస్ఐ గార్లతో రహదారి వెంబడి ప్రయాణించి అవసరమగు చోట మారమ్మతులకు ఆదేశించారు 5. స్కూల్/కాలేజ్ జోన్స్ వద్ద స్పీడ్ లిమిట్ తగ్గింపు దిశగా చర్యలు 6. బ్లాక్ స్పాట్స్ గుర్తింపు రహదారి వెంబడి మొత్తంగా 36 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు మూల మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సైన్ బోర్డ్స్ ఏర్పాటు. కలవర్ట్ ల వద్ద రేడియం స్టికర్స్ కనపడేలా గడ్డిని తొలగించి మరమ్మతులు చేయించారు వీటితోపాటు స్థానిక పోలీస్ చే ప్రజలలో ట్రాఫిక్ నిబంధనల పైన నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, రాత్రి వేళలో గస్తి, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లాంటి చట్టాలు అమలు, నిరంతర రోడ్డు భద్రత ఆడిట్ లాంటి కార్యక్రమాలను రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నూతన విధివిధానాలతో ఎస్పీ గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ప్రమాద స్థాయిని గణనీయంగా తగ్గించగలిగారు ఇందుకు గాను నేను రాడ్ టెక్డాటం వారు ఇచ్చిన సమాచారం ప్రకారం 12 మందికి ప్రశంస పత్రాలను అందించడం జరిగింది.

* ప్రమాదాల నిష్పతీ*2022 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు తో 2023 జనవరి నుండి ఆగష్టు జిల్లా ఎస్పి ఛార్జ్ తీసున్నప్పటి నుండి పోల్చి చూడగా రోడ్డు ప్రమాదాలలో మరణించే స్థాయిలో ఆక్సిడెంట్ అయిన శాతం 28.9%, తీవ్రంగా గాయపడే శాతం 62.5%, మామూలు గాయాల శాతం 53.3% తగ్గించబడ్డాయి గమనిక పై పట్టిక ఆక్సిడెంట్స్ / ప్రమాదాలలొ గల శాతన్ని వివరిస్తుంది.

*డెత్ రేషియో పర్సన్స్ ఇన్వాల్వ్*2022 జనవరి నుండి ఆగస్టు తో జనవరి నుండి ఆగష్టు పోల్చి చూడగా రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి శాతాన్ని 37.2%, తీవ్రంగా గాయాల శాతన్ని 30%, చిన్న గాయాలు అయిన వారి శాతన్ని 47.4% జిల్లా ఎస్పీ అధికారులు, ప్రజలు మరియు మీడియా వారి సహకారంతో తగ్గించగలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!