Judge Calls for Strict Road Safety Discipline
రోడ్డు భద్రత నియమావళి పాటించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
రోడ్డుపైన వాహనాలు నడుపుతున్నప్పుడు క్రమశిక్షణతో, బాధ్యతతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత నేషనల్ యూత్ డే ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తిగారు ప్రసంగించారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తే కఠిన శిక్షలు పడతాయని అన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాటి ఓనర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెయ్యి మంది విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహనలో పాలుపంచుకోవడం అభినందనీయమని జడ్జి ఆనందాన్ని వ్యక్తం చేసారు. భవిషత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.శ్రీనివాస్ డి.ఎస్.పి. సంపత్ రావు ఆర్.టి.ఓ. సందాని డి.ఈ.ఓ. రాజేందర్ సి ఐ నరేష్ కుమార్, ఎస్.ఐ. సాంబమూర్తి వెయ్యి మంది విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
