పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా(రోడ్ సేఫ్టీ మంత్ సెలెబ్రేషన్స్ ) సందర్భంగా, జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీస్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిల్సా ) సెక్రటరీ శ్రీమతి ఇందిరా దేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
మొదటగా ట్రాఫిక్ నిబంధనలు కలిగిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా కలెక్టర్ “రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. అందరూ హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
డిఎల్ఎస్ఎ సెక్రటరీ శ్రీమతి ఇందిరా దేవి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలు, అధికార యంత్రాంగం కలిసి పనిచేయాలి. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు” అని అన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ.. “ఈ బైక్ ర్యాలీ యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం, రోడ్ భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించబడింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అనివార్యం. ప్రమాదాలను నివారించేందుకు, బాధ్యతాయుతమైన రైడింగ్ అలవర్చుకోవాలి. సురక్షిత ప్రయాణం మన కుటుంబానికి, సమాజానికి మేలు కలిగించే అంశం. మీరు అందరూ సురక్షితంగా, నియమాలను పాటిస్తూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను.”
అనతరం జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ క్లాక్ టవర్, అశోక్ థియేటర్ ఎక్స్ రోడ్, న్యూ బస్టాండ్, న్యూ టౌన్, మెట్టుగడ్డ నుండి యూ టర్న్ తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగించారు..
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పోలీసులు పాల్గొని, ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.
కార్యక్రమమునందు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఐఏఎస్ అదనపు ఎస్పి రాములు, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ ఎం.కిషన్, ట్రాఫిక్ డి.ఎస్.పి సుదర్శన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఉమెన్ పి.ఎస్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసులు, ఎం.వి.ఐ/డి.టి.ఒ, రఘు కుమార్, ఆర్.ఐ లు కృష్ణయ్య, రవి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.