
Road
వనపర్తి లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి
రోడ్డు కు అడ్డంగా ఉన్న భవనాలను కూల్చి వేయాలి
కలెక్టర్ అధికారులకు అదేశాలు
వనపర్తి నేటిధాత్రి:
9+వనపర్తి జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వనపర్తి పట్టణం లో పాన్గల్ రోడ్ , కొత్తకోట, పెబ్బేరు రోడ్డు విస్తరణ పై అటవీ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న షాపింగ్ యజమానులు, ఇళ్ల యజమానులకు నోటీస్ లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. నోటీస్ లు జారీ చేసిన వారికి ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చి భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన పెబ్బేరు రోడ్డు, ఈకో పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ స్కూల్ కు సంబంధించిన అటవీ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో డి.ఎఫ్ ఒ ప్రసాద్ రెడ్డి, ఆర్.ఎఫ్. ఒ అరవింద్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.