రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనీకి చెందిన ఆవునూరి వెంకటి అనే నిరుపేద వ్యక్తి ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడడంతో వెంటనే అతనిని వరంగల్ లోని యం.జి.యం ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి రెండు పక్కటెముకలు , వెన్నెముక విరిగిందని మూడు నెలలు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వెంకటిది చాలా నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి, ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు..ఈ విషయాన్ని ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కు స్థానికులు మీడియా ప్రతినిధులు తెలపడంతో యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ సోషల్ మీడియా ద్వారా 5000రూపాయల విరాళాలు సేకరించి ఆ డబ్బులతో 50kgల బియ్యం, నిత్యావసర సరకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మన్న కోక్కుల సతీష్ ల చేతుల మీదుగా ఆ కటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో యువత ప్రధాన కార్యదర్శి జంగపల్లి మల్లయ్య సలహదారు బింగి శివకిరణ్, యువ నాయకులు సంగ రవి యాదవ్,గోనె రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు..