Ritika Selected for State-Level Karate Championship
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రితిక ఎంపిక
పరకాల,నేటిధాత్రి
రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ కరాటే పోటీలకు పరకాల పట్టణానికి చెందిన పోచంపల్లి రితిక ఎంపిక అయినట్లు క్రియేటివ్ కరాటే డూ వ్యవస్థాపకులు మాడ సంపత్ పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో రితిక ప్రతిభ చూపినట్లు తెలిపారు.అండర్ 19.56కిలోల విభాగంలో రితిక ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక అయిందన్నారు.డిసెంబర్ నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు.కాగా రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన రితికను మాస్టర్ పాపయ్యతో పాటు పలువురు అభినందించారు.
