రైసింగ్ సన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నేటిధాత్రి, కాశీబుగ్గ

రైసింగ్ సన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల అనంతరం, మేము విద్యను బోధించిన విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఎదిగి మా కళ్ళ ముందు ఇలా కనిపించడం చాలా సంతోషకరంగా ఉందని రైసింగ్ సన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షణ్ముఖ చారి అన్నారు. వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఎంకె నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్స్ లో ఏర్పాటుచేసిన, (సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి తమ స్నేహితులు రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేసుకొని ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నామని పూర్వ విద్యార్థులైన కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని మా యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ పలువురు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షణ్ముఖ చారి మాట్లాడుతూ మేము మా పాఠశాలలో విద్యను బోధించిన విద్యార్థులు, నేడు ఉన్నత స్థానాలలో ఉండి వారి యొక్క జీవితాలలో, సంతోషాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మేము విద్య బోధించిన ఫలితం వారి జీవితాలను అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేసిందన్న సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షణ్ముఖ చారి అన్నారు. ఇంకా వారి జీవితాలలో ఎన్నో విజయాలను సాధించి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధానోపాధ్యాయునిగా ఆశీర్వదిస్తున్నానని షణ్ముఖ చారి తమ పూర్వ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!