ఆకతాయిల ఆగడాలు: రైతు పంటకు నిప్పు, పైప్లాన్ తగలబెట్టి.. తీవ్ర ఆగ్రహం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పిచర్యగడి గ్రామంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. మంగళవారం గోపాల్ అనే రైతు పంటను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టగా, శుక్రవారం రాత్రి పంగల ప్రశాంత్ అనే రైతు పొలంలోని వ్యవసాయ పైప్లాన్ను ఆకతాయిలు తగలబెట్టారు. ఈ ఘటనతో ప్రశాంతక్క సుమారు రూ. 20 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న తమకు ఇలాంటి సంఘటనలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
