రెండు వందల మంది నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిక
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపిని బొంద పెట్టుడు ఖాయం-వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి ని ప్రజలంతా బొంద పెట్టుడు పెట్టుడు ఖాయమని తేలిపోయిందని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి శక్తిని పెంచుదామని పిలుపునిచ్చారు. కొత్తపెల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో రేకుర్తి నుంచి బీఆర్ఎస్ నాయకులు నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో రెండు వందల మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ పార్టీలోకి ఆహ్వానించి రాజేందర్ రావు కండువాలు కప్పారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ రేకుర్తి డివిజన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఐదారు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమయిందని తెలిపారు. నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అభినందనీయమని చెప్పారు. కలిసికట్టుగా అందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శక్తిని పెంచుతామని పేర్కొన్నారు. దీంతో పాటు కరీంనగర్ కావలసిన ఫండ్స్ సౌకర్యాలు తెచ్చుకుందామని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించుకుందామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా కలిసి మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. అనంతరం నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థపై జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్ రావ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్, బిజెపికి గట్టి బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజేందర్రావుకి అసెంబ్లీ ఇన్చార్జి నియమించడం ద్వారా నూతన ఉత్సాహం నెలకొందన్నారు. ఈకార్యక్రమంలో వందలాది మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
