వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమం లో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్లమలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సిసి కుమారస్వామి,మహిళా సంఘం సభ్యులు కావ్య, లక్ష్మి,రాధ,ప్రియాంక,రాణి, సుగుణ,చందన,ఎరుకల భారతి,పొన్నాల సునీత,యారా రజిత,పెళ్లి పద్మ, ఎరుకల సుకపాల,సిసి రాజు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.