సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణ స్థానిక 10వ, 22వ వార్డులలో మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి.
ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ..
రైతులు చాలా కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా గుర్తించబడి ఏర్పాటు చేయబడిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలకు 2320 రూపాయల మరియు బి గ్రేడ్ రకం ధాన్యానికి గుండాలకు 2300 రూపాయల మద్దతు ధరకు వరి ధాన్యాన్ని అమ్మాలని అన్నారు..
అదేవిధంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అంచనా వేస్తూ ధాన్యాన్ని ఆరబెట్టడం అలాగే తాలు మట్టి బిడ్డలు లేకుండా ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిర్వాహకులకు సహకరించాలని రైతులను కోరుతున్నామని అన్నారు..
అంతేకాకుండా రైతులను నీడ పట్టున ఉంచడానికి చలువ పందిర్లు, మంచినీటి వసతి ఒక పద్ధతి ప్రకారం గా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా టోకెన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని రహదారులపై పాడి సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ప్రయాణికులకు తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎలాంటి అవకతవకలు, ప్రమాదాలు జరగకుండా ఒక ప్రణాళికతో వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా వరి ధాన్యం కొనుగోలు కేంద్రము నిర్వహించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేసేలా తగు చర్యలు చేపడుతూ ఒకవేళ దురదృష్టవశాత్తు తడిసిన ధాన్యం ఉన్న దాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదే విధంగా సన్నబడ్లకు 500రూపాయల బోనస్ ను ఇస్తానంటున్న ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలకు బోనస్ లు ఇవ్వాలని అలాగే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు కల్లూరి లత మధు, బోలగం నాగరాజ్ గౌడ్, బుర్ర లక్ష్మి శంకరయ్య, బుర్ర మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎర్రవెల్లి,ఏఎంసీ డైరెక్టర్లు, మెప్మా టిఎంసి రాజేశం, మెప్మా సిబ్బంది, పుర ప్రముఖులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, హమాలీ సంఘం,మహిళా సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.