ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
… సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో కలిసి ప్రారంభించారు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు.అనంతరం మండలంలోని సిఎం రిలీఫ్ ఫండ్ 63 మంది లబ్దిదారులకు రూ.17,63,500/చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆసుపత్రిలో వైద్యము చేయించుకొని డబ్బు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు మోటే ధర్మారావు తక్కలపల్లి రాజు క్యాథరాజు రమేష్ నీరటి మహేందర్ మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు