
నిరంతరం పేదల పక్షాన నిలబడే మహానేత రేవూరి ప్రకాష్ రెడ్డి
కొయ్యడ శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మొట్టమొదటి బిల్ రావడం జరిగిందని
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేదల పక్షాన నిలబడే మహానేత అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళలను నిరుపేదలకు చేరే విధంగా వారందరూ పూర్తిగా కట్టుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేసుకుంటూ నిరంతరం లబ్ధిదారుల నిర్మాణంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేసుకుంటూ ఇల్లు నిర్మించే విధంగా ఇలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ పాలనలో నిరుపేద ప్రజలను కులగొట్టుకోమని చెప్పి ఎడారిలో ఉంచి వాళ్లను రోడ్డున పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం కానీ నాటి ఇందిరమైనులైన నేటి ఇందిరమ్మ ఇళ్లయిన అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది పేదలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తోటే న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈ యొక్క ఇందిరమ్మ లబ్ధిదారులకు మొదటి బేస్మెంట్ బిల్లు 21,3,14 వార్డులలో బండారి లక్ష్మి,గడ్డం శైలజ,జోరు విజయలలిత,ఎండి అక్బరుద్దీన్,అలీ లకు మొదటి బిల్లు లక్ష రూపాయలు రావడం జరిగిందన్నారు.ఈరోజున వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇది కేవలం పేదవాడి ఇంటి కల నెరవేర్చడం అది కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యం ఇది రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్,బండి సదానందం గౌడ్,సుధమల్ల రమేష్,మొగిలి తదితరులు పాల్గొన్నారు.