https://epaper.netidhatri.com/
ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిస్తుంటే, 610 జీవో అమలుకోసం ఒక్కనాడు పాటుపడని రేవూరిని ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. పార్టీ మారి, నియోజకవర్గం మార్చుకొని వచ్చినంత మాత్రాన మేకవన్నె పులిని ప్రజలు గుర్తించరా? తెలంగాణ లో అవకాశవాద రాజకీయాలకు చోటు లేదు. కాంగ్రెస్ కు ఓటు పడదు అంటున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో సాగుతున్న ప్రచార వివరాలు ఆయన మాటల్లోనే…
`610 జీవో చైర్మన్ గా తెలంగాణకు న్యాయం చేయలేదు.
`తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు.
`పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టావ్.
`జీవితాంతం కాంగ్రెస్ ను తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరావ్.
`జనం చీకొట్టినా మారలేదు.
`రేవూరికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదు.
`పార్టీలు మారినట్లే, స్థానాలు కూడా మార్చే ఊసరవెళ్లి.
`రేవంత్ ను నమ్మి కొత్త ముసుగేసుకుంటే ప్రజలు నమ్మరు.
`దొంగలు, దొంగల సావాసం చేస్తారంటే ఇదే.
`రేవూరికి డిపాజిట్ కూడా దక్కదు.
`ప్రజలను ఓట్లడిగే నైతికత రేవూరికి లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రేవూరి ప్రకాశ్‌రెడ్డి పచ్చి అవకాశవాది. తన రాజకీయం స్వార్ధం కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పూటకో ముసుగేసుకొని, ప్రజలు చీ అన్నా, తిరస్కరించినా రాజకీయాల కోసం పాకులాడుతున్నాడు. జీవితాంతం తన రాజకీయ పబ్బం కోసం ఏ కాంగ్రెస్‌నైతే నిత్యం తూర్పారపట్టాడో ఆ పార్టీలో చేరి మళ్లీ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని చూస్తున్న నాయకుడిని ప్రజలు ఎట్టిపరిస్ధితుల్లో నమ్మరు. తెలంగాణకు సేవ చేసే అవకాశం వచ్చినా, రేవూరి తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసి, తన పరపతికోసం పాకులాడిన నాయకుడు రేవూరి. తెలంగాణ యువత జీవితాలను చిదిమేసిన దుర్మార్గుడు రేవూరి. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని తెలంగాన సమాజమంతా గగ్గోలు పెడుతుంటే, అప్పటి పాలకులు వేసిన 610 జివో అధ్యయన కమిటికి చైర్మన్ చేస్తే రేవూరి ఏం చేశాడు. ఎలాంటి నివేదిక ఇచ్చాడు. కేవలం తూతూ మంత్రంగా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి, తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఏనాడు పరిగణలోకి తీసుకోలేని అసమర్ధుడు రేవూరి. కేవలం చాయ్ బిస్కట్ల కోసం కమిటీ సమావేశాలు ఏర్పాటు సీమాంద్ర పాలకులు అడుగులకు ముడుగులొత్తి, తెలంగాణ ప్రయోజనాలు కాలరాసిన నీతిలేని వ్యక్తి రేవూరి. తెలంగాణ ఆత్మ క్షోభించేలా చేసిన దుర్మార్గుడు. కమిటీ చైర్మన్‌గా వుండి అధికారులు సహకరించడం లేదని తన చేతగాని తనన్నా బైట పెట్టుకున్నాడే గాని, తెలంగాణ కోసం ఆయన బైటకు రాలేదు. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఆ పాలకులను నిందించలేదు. కనీసం సహకరించని అధికారుల మీద కూడా చర్యలకు ఉపక్రమించలేదు. అంటే ఆయన కావాలనే తెలంగాణకు అన్యాయం చేసేవారికి వత్తాసు పలికి, తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో పదవులు ఆశలతో కాంగ్రెస్‌చేరాడు. తన రాజకీయ జీవితమంతా రాజకీయంగా కాంగ్రెస్‌తో పోరాటం చేసిన వ్యక్తి రేవూరి. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో చేరి తాను పచ్చి అవకాశవాదినని నిరూపించుకున్నాడు. ఇలాంటి నాయకులే వల్లే ఒకప్పుడు తెలంగాణ తీరని అన్యాయానికి గురైంది. నిరాధరణ గురైంది. నిర్లక్ష్యాన్ని చవిచూసింది. అభివృద్ధికి ఆమడ దూరం విసిరేయబడిరది. కేవలం ఉమ్మడి పాలకులు మోచేతి నీళ్లు తాగేందుకు తప్ప, తెలంగాణ ప్రయోజనాల కోసం కలలో కూడా పనిచేయని రేవూరి లాంటి వారిని ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. అయినా సిగ్గులేని తనంతో రాజకీయం కోసం ఆరాపడుతున్నాడు. అంటూ రేవూరి ప్రకాశ్‌రెడ్డిని తూర్పారపట్టిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో ప్రచార వివరాలు, ప్రత్యర్ధలపై ఆయన విరుచుకుపడుతున్న తీరు ఆయన మాటల్లోనే…
రాజకీయాలు చేయాలంటే నిజాయితీ వుండాలి. ప్రజల కోసం త్యాగం చేసే గుణముండాలి. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిత్వం వుండాలి.
తన ప్రజలను కాపాడుకునే ధైర్యం కావాలి. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి నర్సంపేట ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. కాని ఏం చేశాడు. తెలంగాణ వచ్చిన తర్వాతే నర్సంపేటకు కళ వచ్చింది. అభివృద్ది జరిగింది. అక్కడ రేవూరికి స్దానం లేదు. గత ఎన్నికల్లో నర్సంపేటలో ప్రజలతో మరోసారి చీ కొట్టించుకోవడం ఇష్టంలేక, వరంగల్ వెళ్లి అక్కడ ప్రజలను నమ్మించాలని చూశాడు. కాని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరంగల్ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. వారికి రేవూరి వ్యక్తిత్వం తెలుసు. ఆయన రాజకీయం తెలుసు. తెలంగాణకు ఆయన చేసిన ద్రోహం తెలుసు. అందుకే ఆయనను అక్కడ కూడా గెవలకుండా తీర్పిచ్చారు. తెలుగుదేశం నంంచి బిజేపికి వెళ్లాడు. అక్కడ ఆయన నాయకత్వ పటిమ ఎంటిదో తెలుసుకొని వాళ్లు పక్కన పెట్టేశారు. రేవంత్ నాయత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు వెళ్లి, రాజకీయం చేద్దామని, ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు పరకాలకు వచ్చాడు. రేవూరి ఎంతటి రాజకీయ స్వార్ధపరుడో పరకాల ప్రజలకు కూడా తెలుసు. దొంగలు,సావాసం చేస్తారంటే ఇదే…తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూసి, ఓటుకు నోటుకు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డితో కలిసి సాగుతున్న వాళ్లంతా అవకాశవాదులే. అందులోకైతే సులభంగా దూరిపోవచ్చని అటు బాట పట్టాడు. పరకాలలో పోటీకి వస్తున్నాడు. అసలు పరకాలలోనే కాదు, తెలంగాణలో ఎక్కడా ఓటు అడిగే నైతిక హక్కు లేని వ్యక్తి రేవూరి. పరకాల ప్రజలు ఎంతో చైతన్య వంతులు. పరకాలను అన్ని రకాలుగా అభివృద్ది చేశాను. పరకాల నా అడ్డా. అంత గర్వంగా చెప్పగలను. ఇది అభివృద్ది చేసిన నాయకులు మాత్రమే చెప్పుకోగలరు. ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నర్సంపేటను కన్నెత్తి చూడని రేవూరి పరకాల మొహం కూడా చూడడు. అనుకోని అవకాశం వచ్చిందని వస్తున్నాడు. పరకాల మీద ప్రేమతో కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పరకాల వచ్చాడు. అలాంటి వ్యక్తికి పరకాల ప్రజలు ఓటు కూడా వేయరు. డిపాజిట్ కూడా రాదు..
పరకాలలో నేను చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తోంది.
పదేళ్ల క్రితం పరకాల ఎలా వుండేది. ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలకు తెలుసు. ఒకప్పుడు మంచినీటికి కూడా కటకటలాడిన పరకాల సాగులోనూ దూసుకుపోతోంది. నా ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల, కార్యకర్తల సహాకారంతో గ్రామ గ్రామాన ప్రచారం విసృతంగా సాగుతోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనతో తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు అనుభవించని కష్టాలు తీరిపోయాయి. మారు మూల పల్లె అయినా, పట్నమైనా సరే కరంటు ఇరవై నాలుగు గంటలు వస్తుంది. దేశంలోనే ఎక్కడా ఇలా ఇరవై నాలుగు గంటల కరంటు వ్యవసాయానికి ఇస్తున్నది లేదు. కాంగ్రెస్ పార్టీ మేం గెలిచామని విర్రవీగుతున్న కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతును మోసం చేశారు. తెలంగాణలో ఎలాంటి హమీ లేకుండానే రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు గత తొమ్మిది సంవత్సరాలుగా ఇస్తున్నాం. కాని కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడు గంటల కరంటు ఇస్తామని చెప్పి, కనీసం మూడు గంటలు కరంటు కూడా ఇవ్వలేక చేతులెత్తేశారు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ తెలంగాణ ప్రజలను నిండా ముంచేస్తారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరంటు సాధ్యమైనప్పుడు కర్నాకటకలో ఎందుకు ఇవ్వడం లేదు? అంటే వారికి పాలన కంటే కొట్లాటలు ముఖ్యం. ప్రజల ప్రయోజనాల కంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వప్రయోజనాలు,రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వారికి కావాలి. అందుకే ప్రజలను వారి, సంక్షేమాన్ని గాలికి వదిలేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభూ ఏళ్లకుపైగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇరవైనాలుగు గంట కరంటు ఎనాడైనా ఇచ్చిన చరిత్ర వుందా? తెలంగాణ రైతులు సంక్షేమం పట్టిందా? రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రస్ వుందా? ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే తెలంగాణలోనే కాదు,దేశంలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు పక్కన పెట్టారు. తెలంగాణ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రంలో సంక్షేమ పాలకుడు కేసిఆర్ నాయకత్వంలో సుబిక్షమైన తెలంగాణను ఓర్చుకోలేక కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. కాని వారి ఆటలు చెల్లవు. వారి రాజకీయాలకు చోటు లేదు. పరకాలలో కాంగ్రెస్‌కు డిపాజిట్‌కూడా రాదు…గతం కన్నా మరింత మెజార్టీతో గెలుస్తా…తెలంగాణలో మా పార్టీ 90కి పైగా సీట్లు గెల్చుకొని మూడోసారి మళ్లీ ప్రభంజనం సృష్టిస్తాం…