
విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సురవరంకు నివాళులు
నర్సంపేట,నేటిధాత్రి:
విప్లవ దృవతార, కమ్యూనిస్టు దిగ్గజం, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తమ పార్లమెంటరీయన్, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీడత పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరనిలోటని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థ సారథి అన్నారు.మంగళవారం నర్సంపేట కేంద్రంలోని ఎస్ ఆర్ వొకేషనల్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ 1942లో మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించిన సుధాకర్ రెడ్డి 1960లో ఎఐఎస్ఎఫ్ విద్యార్థినేతగా ఎదిగి 1966 లో ఎఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న గొప్ప విప్లవకారుడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోతు స్టాలిన్,పాలక పవన్,భూక్య రాకేష్, పిట్టల అజయ్,కొలువురు బన్నీ, విద్యార్థులు పాల్గొన్నారు.