
సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మిక వర్గానికి విప్లవ జేజేలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నారనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారి వర్గమైన కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తూనే దేశంలో అమలవుతున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా మార్చి 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్స్ గా తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోడ్స్ లో పని భద్రత లేకపోవడం ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేకపోవడం వారానికి 70 గంటల పని విధానం తీసుకురావడం కార్మికుల కోరికలు డిమాండ్లు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ధైపాక్షిక ఒప్పందాల ద్వారా అమలుపరచుకునే విధానానికి స్వస్తి పలికి నాలుగు లేబర్ కోడ్స్ కు కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారి వర్గానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం మోడీ ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మెను చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
దాసరి జనార్ధన్ నామల శ్రీనివాస్
కాసర్ల ప్రసాద్ రెడ్డి రాళ్ల బండి బాబు జయశంకర్ ‘ఎండి సాజిద్ కే మధుకర్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు